NEWSANDHRA PRADESH

బాబు ప్ర‌జా ద‌ర్బార్ స‌క్సెస్

Share it with your family & friends

ప్ర‌జ‌ల నుంచి నేరుగా విన‌తులు

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న మార్క్ పాల‌నకు శ్రీ‌కారం చుట్టారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే తిరుమ‌ల‌కు వెళ్లారు. అక్క‌డి నుంచే ప్ర‌క్షాళ‌న స్టార్ట్ చేశారు. తిరుమ‌ల‌లో ఓం న‌మో వేంకటేశాయ అన్న స్మ‌ర‌ణ త‌ప్ప వేరే ఏదీ వినిపించ కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు.

ఆ వెంట‌నే రాజ‌కీయాల‌కు కేరాఫ్ గా మార్చేసిన టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డిపై వేటు వేశారు. నిజాయితీ క‌లిగిన ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందిన సీనీయ‌ర్ ఐఏఎస్ జె. శ్యామ‌లా రావును నియ‌మించారు. ఆయ‌న వ‌చ్చాక తిరుమ‌ల‌లో క‌ద‌లిక‌లు ప్రారంభం అయ్యాయి. భ‌క్తుల క‌ష్టాలు తీర‌డం మొద‌ల‌య్యాయి.

ఇదే స‌మ‌యంలో అసెంబ్లీలో స్పీక‌ర్ ఎన్నిక ఏక‌గ్రీవంగా జ‌రిగింది. చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడ స‌భా ప‌తిగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌ను అభినందించిన వెంట‌నే నేరుగా మంగ‌ళ‌గిరికి చేరుకున్నారు. అక్క‌డ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. భారీ ఎత్తున జ‌నం త‌మ వినుత‌ల‌తో వ‌చ్చారు. సీఎంకు త‌మ స‌మ‌స్య‌ల గోడు వెళ్లబోసుకున్నారు.