సమస్యలపై పవన్ ఫోకస్
దూకుడు పెంచిన డిప్యూటీ సీఎం
అమారవతి – ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై జనసేన పార్టీ చీఫ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పాలనా పరంగా దూకుడు పెంచేలా చర్యలు చేపట్టారు. ఆయన తొలిసారిగా శాసన సభలోకి అడుగు పెడుతూనే ప్రజా పాలన అందించేందుకు కూటమి ప్రయత్నం చేయాలని కోరారు.
ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎన్నికల ప్రచారం సందర్బంగా . ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీని కట్టబెట్టారు.
డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన వెంటనే పిఠాపురంపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు మూడు రోజుల పాటు అధికారికంగా పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి రానున్నారు.
పర్యటనలో భాగంగా స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు పవన్ కళ్యాణ్. సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.