ప్రజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం
గిరిజన శాఖ మంత్రి దాసరి సీతక్క
హైదరాబాద్ – ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దాసరి అనసూయ అలియాస్ సీతక్క. ఆమె తన శాఖపై సమీక్ష చేపట్టారు. గంజాయిని నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంతే కాకుండా నిరుద్యోగులకు ఆమె తీపి కబురు చెప్పారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను యుద్ద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు దాసరి సీతక్క. ఈ మధ్యన భూ కబ్జాదారుల గురించి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు.
బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తమ సర్కార్ కొలువు తీరిన తర్వాత అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సేకరించడం జరిగిందన్నారు . ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు మంత్రి.