కేసీఆర్ హయాంలోనే సింగరేణి దివాళా
నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు గనుల వేలం పాటపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. దీనికి ప్రధాన కారకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కీలక కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
దీనిపై తీవ్రంగా స్పందించారు గంగాపురం కిషన్ రెడ్డి. కేసీఆర్ మితి మీరిన రాజకీయ జోక్యం కారణంగానే సింగరేణి కంపెనీ దివాళా తీసేందుకు కారణమైందని ఆరోపించారు. సంస్థ ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు.
తాము దివాళా తీయించింది కాక కేంద్ర సర్కార్ పై, తనను టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు గంగాపురం కిషన్ రెడ్డి.