జగన్..ఏపీ స్టేట్ నీ తాత జాగీరా
నిప్పులు చెరిగిన నారా లోకేష్
అమరావతి – ఏపీ ఐటీ, కమ్యూనిషేన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు.
ఆయన తన తాత రాజా రెడ్డి జాగీరు లాగా వాడుకున్నాడని, ప్రభుత్వానికి తెలియకుండానే అడ్డగోలుగా భూములను కబ్జా చేశాడని ధ్వజమెత్తారు నారా లోకేష్. కేవలం తన పార్టీ వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా రూ. 1,000 నామ మాత్రపు లీజుకు తీసుకున్నాడని మండిపడ్డారు. విచిత్రం ఏమిటంటే 33 ఏళ్లకు లీజుకు తీసుకోవడం దారుణమన్నారు.
ప్రజల నుంచి దోచుకున్న రూ. 500 కోట్లతో ప్యాలెస్ లు కట్టేందుకు ప్లాన్ చేశాడని ఫైర్ అయ్యారు. నీ ఒక్కడి భూ దాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చన్నారు నారా లోకేష్.. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చన్నారు.