DEVOTIONAL

తిరుమ‌లలో రాజ‌కీయాల‌కు తావు లేదు

Share it with your family & friends

ఇక్క‌డ మాట్లాడ‌టం స‌భ్య‌త కాద‌న్న మంత్రి

తిరుప‌తి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం నేరుగా తిరుప‌తికి చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా రేణిగుంట విమానాశ్ర‌యం నుంచి తిరుమ‌ల వ‌ర‌కు దారి పొడ‌వునా జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. పూలు చ‌ల్లి, హార‌తులు ప‌ట్టారు మంత్రికి.

ఈ సంద‌ర్బంగా స్వామి వారిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు వంగ‌ల‌పూడి అనిత‌. అనంత‌రం మీడియాతో మాట్లాడారు హోం శాఖ మంత్రి. సాక్షాత్తు ఆ దేవ దేవుడు కొలువై ఉన్న పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌. స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు మాత్ర‌మే ఇక్క‌డికి వ‌చ్చాన‌ని అన్నారు.

తిరుమ‌ల‌లో ఒక్క శ్రీ వేంక‌టేశ్వ‌రుడి నామం త‌ప్ప వేరే ఏ ప‌దం మాట్లాడేందుకు వీలు లేద‌ని స్ప‌ష్టం చేశారు అనిత‌. ఎవ‌రు కాద‌ని నోరు జారితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. తాను కొండ‌పై ఎలాంటి రాజ‌కీయాలు మాట్లాడ ద‌ల్చు కోలేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.