NEWSANDHRA PRADESH

ప్ర‌భుత్వ స్థ‌లాల‌లో ప్యాలెస్ లా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన తెలుగుదేశం పార్టీ

అమ‌రావ‌తి – ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చ‌ల‌విడిగా అందినంత మేర దోచుకున్నారంటూ ఆరోపించింది. ఇందుకు క‌నిపించే సాక్ష్యాలు ఆయా జిల్లాల్లో పార్టీ ఆఫీసుల కోసం క‌డుతున్న ప్యాలెస్ లు అంటూ పేర్కొంది.

26 జిల్లాల్లో కేవ‌లం రూ. 1000కి 33 ఏళ్ల పాటు లీజులుకు ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను తీసుకున్నారంటూ మండిప‌డింది. తాజాగా నెల్లూరు జిల్లాలో క‌డుతున్న భ‌వ‌న నిర్మాణానికి సంబంధించి ఫోటోల‌ను షేర్ చేసింది టీడీపీ.

గ‌తంలో త‌మ ప్ర‌భుత్వం పేదల టిడ్కో ఇళ్ళ కోసం ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేసి త‌న పార్టీ కోసం ప్యాలెస్ క‌ట్టుకునేందుకు అనుమ‌తి ఎలా ఇచ్చారంటూ ప్ర‌శ్నించింది. రూ. 10 కోట్ల విలువైన రెండు ఎక‌రాల స్థ‌లాన్ని కేవ‌లం ఏడాదికి రూ. 1000 చొప్పున తీసుకోవ‌డం మోసం చేయ‌డం కాదా అని నిల‌దీసింది.

ఈ భ‌వ‌న నిర్మాణానికి ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని, దీనిపై పూర్తి విచార‌ణ జ‌రిపిస్తామ‌ని హెచ్చ‌రించింది.