SPORTS

కంగారూల‌కు ఆఫ్గ‌నిస్తాన్ బిగ్ షాక్

Share it with your family & friends

భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు

అమెరికా – ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. సూప‌ర్ -8 లో భాగంగా జ‌రిగిన ఈ కీల‌క మ్యాచ్ లో ఆఫ్గ‌నిస్తాన్ ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది క‌ప్ ఫెవేర‌ట్ గా పేరు పొందిన ఆస్ట్రేలియా జ‌ట్టుకు.

ఏకంగా 21 ర‌న్స్ తేడాతో గెలుపొంది విస్తు పోయేలా చేసింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది ఆఫ్గ‌నిస్తాన్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 148 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. బ‌ల‌మైన ఆసిస్ జ‌ట్టు ఆఫ్గాన్ దెబ్బ‌కు తేలి పోయింది.

జ‌ట్టులో గుర్బాజ్ 60 ర‌న్స్ చేస్తే జ‌ద్రాన్ 51 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నారు. ఇక ఆసిస్ పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ వ‌రుస‌గా రెండోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ లో హ్యాట్రిక్ సాధించినా ఫ‌లితం లేకుండా పోయింది. చిన్న పాటి ల‌క్ష్యాన్ని సాధించేందుకు నానా తంటాలు ప‌డ్డారు కంగారూలు.

మ్యాక్స్ వెల్ పోరాడినా జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయాడు. 19.2 ఓవ‌ర్ల‌లోనే ఆసిస్ చాప చుట్టేసింది. ఆఫ్గ‌న్ జ‌ట్టు బౌల‌ర్ గుల్బాదిన్ నైబ్ 20 ర‌న్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడ‌డు. హ‌క్ 3 వికెట్లు తీశాడు.