NEWSTELANGANA

సీఎం అంటే క‌టింగ్ మాస్ట‌రా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. సీఎం అంటే క‌టింగ్ మాస్ట‌రా అంటూ ప్ర‌శ్నించారు.

ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా అని నిల‌దీశారు కేటీఆర్. సీఎం అనే ప‌దానికి స‌రికొత్త నిర్వ‌చ‌నం ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆనాడు.. పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారని కానీ ఇవాళ రూ. 2 ల‌క్ష‌ల రుణ మాఫీకి నానా కొర్రీలు పెడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

తొలుత రూ. 39 వేల కోట్లు అని చెప్పార‌ని తీరా ఇప్పుడు రూ. 31 వేల కోట్లు అంటున్నార‌ని మండిప‌డ్డారు కేటీఆర్. పాసు పుస్త‌కాలు లేవ‌నే నెపంతో ల‌క్ష‌లాది మంది రైతుల‌ను మోసం చేసేందుకు సిద్ద‌మ‌య్యారంటూ ఆరోపించారు.

రేషన్ కార్డు సాకు చూపి… లక్షల మందికి మొండి చెయ్యిచ్చే కుతంత్రం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చ‌రించారు కేటీఆర్.