ఇక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటన
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయన వరుస సమీక్షలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు విద్యా రంగంలో కీలక మార్పులు తీసుకు వస్తామని వెల్లడించారు.
ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లోని సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం విధి విధానాలను ఖరారు చేయాలని ఆదేశించారు. ఒకే చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు ఉండేలా సమీకృత వసతి పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు . పైలట్ ప్రాజెక్ట్‌గా సీఎం స్వంత నియోజకవర్గం కొడంగల్ లో, భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.