బ్రహ్మోత్సవం అంగరంగ వైభోగం
చంద్రప్రభ వాహనంపై వేంకటేశ్వరుడు
తిరుపతి – అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామి వారు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో దర్శనం ఇచ్చారు.
ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రస స్వరూపుడైన చంద్ర భగవానుడు ఔషధులను పోషిస్తున్నారు . ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాద పరుస్తారు.
బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.