DEVOTIONAL

సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి అభయం

Share it with your family & friends

ఘ‌నంగా వేంక‌టేశ్వ‌రుడి బ్రహ్మోత్సవాలు

ఘ‌నంగా అప్ప‌లాయ‌గుంట బ్ర‌హ్మోత్స‌వం
తిరుప‌తి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిదారుడి అలంకారంలో స్వామి వారు కటాక్షించారు.

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్య మండల మధ్యవర్తి శ్రీ మన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్య నారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామి వారిని దర్శిస్తే ఇతోధిక భోగ భాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయ‌ని పురాణాలు చెబుతున్నాయి.

కాగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
వాహన సేవలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కంకణ భట్టర్ సూర్య కుమార్ ఆచార్యులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.