DEVOTIONAL

నేడే ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌రుడి ర‌థోత్స‌వం

Share it with your family & friends

భారీగా త‌ర‌లి రానున్న భ‌క్త జ‌న బాంధ‌వులు

తిరుప‌తి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఏడో రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిదారుడి అలంకారంలో స్వామి వారు కటాక్షించారు.

ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా జూన్ 24న సోమ‌వారం రథోత్సవం వైభవంగా జరుగనుంది.

ఉదయం 9 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 9.25 నుండి 11 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

కాగా ఆదివారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.వాహన సేవలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కంకణ భట్టర్ సూర్య కుమార్ ఆచార్యులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.