కూతురును కలవని తండ్రి
కవిత జైలుకు వెళ్లి 100 రోజులు
హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నేటితో ఆమె తీహార్ జైలుకు వెళ్లి సరిగ్గా 100 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు కుటుంబానికి చెందిన కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర మాజీ మంత్రులు కలిసి వచ్చారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం పరామర్శించి వచ్చారు.
కానీ ఇప్పటి వరకు తన ముద్దుల కూతురు ఎలా ఉందని స్వంత తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించక పోవడం విస్తు పోయేలా చేసింది. ఈ వంద రోజుల్లో ఒక్కసారైనా ఎలా ఉందని ఆరా తీయక పోవడం కూడా చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ దందాలో కల్వకుంట్ల కవితదే కీలకమైన పాత్ర అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. తాను ఎలాంటి దందా చేయలేదని బుకాయించే ప్రయత్నం చేస్తోంది కవిత. అయితే కావాలని తనపై కక్ష సాధించేందుకే మోడీ సర్కార్ కూతురుని అరెస్ట్ చేసిందని ఆరోపించారు కేసీఆర్.