సంజయ్ గాంధీ అరుదైన నేత
ఆయనకు మేనకా గాంధీ నివాళి
న్యూఢిల్లీ – మాజీ కేంద్ర మంత్రి మేనకా సంజయ్ గాంధీతో పాటు తనయుడు వరుణ్ గాంధీ సంజయ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఇవాళ దివంగత సంజయ్ గాంధీది 44వ వర్దంతి. ఆయన చని పోయినా ఇప్పటి వరకు ప్రజల మధ్యనే ఉన్నారని పేర్కొన్నారు మేనకా సంజయ్ గాంధీ. మన భారత దేశం కోసం బలమైన, అసాధారణమైన కలలు కన్నారని తెలిపారు.
ఆయన లేని లోటు పూడ్చ లేనిదని పేర్కొన్నారు మేనకా గాంధీ. ఆయన ఆశయాలు, కలలను పూర్తి చేసేందుకు తనతో పాటు కొడుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. సంజయ్ గాంధీకి మరణం లేదని పేర్కొన్నారు. ఆయన జీవితం విలక్షణమైదని తెలిపారు.