తెలుగు ప్రజలంతా బాగుండాలి
శ్రీవారిని వేడుకున్నానన్న అనిత
తిరుమల – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆమెకు అధికారికంగా సాదర స్వాగతం పలికారు. ఇటీవలే కొలువు తీరిన కొత్త సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవో ఏవీ ధర్మా రెడ్డిపై వేటు వేసింది. ఆయన స్థానంలో సిన్సియర్ ఆఫీసర్ జె. శ్యామలా రావును నియమించింది.
రాష్ట్ర మంత్రిగా తొలిసారి తిరుమలను సందర్శించిన అనితకు ప్రోటోకాల్ ప్రకారం టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికారు. ఆమె రాకతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఓం వేంకటేశాయ నమః అన్న పదం తప్ప వేరేది ఏదీ వినిపించ కూడదన్నారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవ దేవుడిని ప్రార్థించానని చెప్పారు.