ఎమ్మెల్యేను ఓదార్చిన బండి
రూపాదేవికి ఘనంగా నివాళులు
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. ఈ సందర్బంగా తన ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రిని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు మేడిపల్లి సత్యం.
ఇటీవలే ఎమ్మెల్యే సతీమణి రూపా దేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైందిన మేడిపల్లి సత్యం కుటుంబం. ఎమ్మెల్యేకు, వారి పిల్లలకు, కుటుంబానికి ధైర్యం చెప్పారు బండి సంజయ్ కుమార్. అనంతరం ఇటీవలే మృతి చెందిన రూపాదేవి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేంద్ర మంత్రి.
స్థైర్యాన్ని కోల్పో కూడదని, గుండె నిబ్బరంతో ఉండాలని బండి సంజయ్ కుమార్ పటేల్ మేడిపల్లి సత్యంను ఓదార్చారు. కాలం బలీయమైనదని, దాని నుంచి ఎవరూ తప్పించు కోలేరని పేర్కొన్నారు .