మెగా డీఎస్సీపై తొలి సంతకం
మంత్రిగా బాధ్యతలు స్వీకరణ
అమరావతి – ఏపీ రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగు పెట్టారు. ప్రభుత్వం నారా లోకేష్ కు సచివాలయంలోని 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 208 చాంబర్ ను కేటాయించారు.
ఇందులో భాగంగా ఆయన తన తొలి సంతకాన్ని ఏపీ మెగా డీఎస్సీ విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. దీనిని కేబినెట్ తీర్మానం కోసం పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవిత, టీజీ భరత్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమా మహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్ హాజరయ్యారు.
వీరితో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి రవి నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, బుద్ధా నాగ జగదీష్, అంగర రామ్మోహన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు.