NEWSANDHRA PRADESH

ప్ర‌జారోగ్యం ప్ర‌భుత్వ ప్ర‌థమ ల‌క్ష్యం

Share it with your family & friends

ఏపీ పుర‌పాలిక‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి

విజ‌య‌వాడ – ఏపీ పుర‌పాలిక‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించారు. ఆయ‌న వెంట ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ఉన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌ట్ట‌ణంలో ఆక‌స్మికంగా ప‌లు ప్రాంతాల‌లో ప‌ర్య‌టించారు. నీటి నాణ్య‌తను ప‌రిశీలించారు.

వ‌ర్షాకాలంలో డ‌యేరియా , సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాప్తి చెంద‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్రజారోగ్యంపై మున్సిపల్ శాఖ ప్రధాన దృష్టి పెట్టిందన్నారు. వర్షా కాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తమైందన్నారు.

. మంచినీటి సరఫరా, నీటి నాణ్యతపై ప్రజలను నేరుగా కలుసుకొని ఇబ్బందులు తెలుసుకున్నారు. అందులో భాగంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ప‌ర్య‌టించారు. మంచినీటి సరఫరా నాణ్యతను పరిశీలించామని.. పలు ప్రాంతాల్లో సుమారు 600 శాంపిల్స్ సేకరించి పరీక్షించినట్టు తెలిపారు.

నీటి నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. నిబంధనల ప్రకారమే మంచినీటి నాణ్యత ఉందన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో సుమారు 12 లక్షల మందికి.. 187 ఎంఎల్ డి నీటి సరఫరా జరుగుతోందన్నారు.

వర్షాకాలంలో డ్రైయిన్ల వద్ద మురుగు నీరు పొంగి మంచి నీటిలో కలిసే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకే అధికారులకు సిల్ట్ డ్రైవ్ చేపట్టాలని సూచించామన్నారు.