NEWSANDHRA PRADESH

అవినీతి అక్ర‌మాల‌పై శ్వేత ప‌త్రాలు

Share it with your family & friends

ముగిసిన ఏపీ మంత్రివ‌ర్గం స‌మావేశం

అమ‌రావ‌తి – సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఏపీ మంత్రివ‌ర్గం స‌మావేశం ముగిసింది. దాదాపు ఈ కీల‌క మీటింగ్ మూడున్న‌ర గంట‌ల పాటు కొన‌సాగింది. ఇందులో భాగంగా చంద్ర‌బాబు నాయుడు చేసిన 5 సంత‌కాల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వ‌హించాల‌ని మంత్రివ‌ర్గం తీర్మానం చేసింది. ఇవే సమావేశాల‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

ఇందులో భాగంగా వివిధ శాఖ‌ల‌కు సంబంధించిన శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేయాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా శ్వేత ప‌త్రాల విడుద‌ల‌పై మంత్రివ‌ర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం.

ఇదే స‌మ‌యంలో మొత్తం వ్య‌వ‌హారంపై అధ్య‌య‌నం చేయ‌నుంది. స‌బ్ క‌మిటీ నివేదిక ఆధారంగా శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేయ‌నున్నారు.