రాజ్ నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ
కీలక అంశాలపై చర్చించిన సీఎం
న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు ఎంపీలు మల్లు రవి, రఘు రామి రెడ్డి, బల రామ్ నాయక్ , సురేష్ షట్కర్, రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీతో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా సీఎం, కేంద్ర మంత్రి మధ్య కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ కూలి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉండగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఇటు మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ కావడం ఇది రెండోసారి.
విమర్శలు, ఆరోపణలు అనేవి రాజకీయాల వరకే ఉంటాయని , అభివృద్దికి సంబంధించి కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గట్టి బంధం ఉండాలని, దానిని తాము కోరుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే ఆయన ఇవాళ రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.