నారా లోకేష్ సమర్థుడు – బ్రాహ్మణి
కుటుంబ పరంగా అండగా ఉంటాం
అమరావతి – ఏపీ ఐటీ , కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా నారా లోకేష్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై చేశారు. మంత్రిగా కొలువు తీరిన తన భర్త నారా లోకేష్ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు నారా బ్రాహ్మణి.
ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఈడీ వెలుగులతో వాటి రూపు రేఖలు మార్చేశావు నువ్వు అంటూ కితాబు ఇచ్చారు నారా బ్రాహ్మణి.
పనిలో పడి విమర్శలను పట్టించు కోకుండా అవార్డుల పంట పండించావని పేర్కొన్నారు. నీ వ్యక్తిత్వ హననం చేసిన వారంతా అవాక్కయ్యేలా వాళ్లకు నువ్వేంటో తెలియజేశావని ప్రశంసలతో ముంచెత్తారు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు. నీ సమర్ధతతో నేటి తరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుందన్నారు బ్రాహ్మణి. కుటుంబ పరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం తప్పక ఉంటుందని స్పష్టం చేశారు.