భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
జింబాబ్వేతో 5 మ్యాచ్ ల టీ20 సీరీస్
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో భారత దేశంలో పర్యటించనుంది జింబాబ్వే క్రికెట్ జట్టు. ఇందులో భాగంగా ప్రస్తుతం టీమిండియా అమెరికా, విండీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టి20 వరల్డ్ కప్ లో ఆడుతోంది.
ఇదిలా ఉండగా జింబాబ్వే జట్టు వచ్చే జూలై నెలలో భారత్ కు రానుంది. ఈ మేరకు 5 మ్యాచ్ ల టి20 సీరీస్ కు గాను భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో ఈ జట్టును ప్రకటించారు. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన టీమ్ లో యువ ఆటగాళ్లకు బిగ్ ఛాన్స్ ఇచ్చింది.
ఇక భారత జట్టుకు ఊహించని రీతిలో శుభ్ మన్ గిల్ కు కెప్టెన్సీ అప్పగించింది. జట్టు పరంగా చూస్తే యశస్వి జైస్వాల్ , రుతురాజ్ గైక్వాడ్ , అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ , ధ్రువ్ జురైల్ , నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, సుందర్, రవి బిష్ణోయ్ , అవేశ్ ఖాన్ , ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే ఉన్నారు.