శాంసన్ కెప్టెన్సీకి పనికి రాడా
మరోసారి ముంబై లాబీయింగ్
ముంబై – గత కొన్నేళ్లుగా క్రికెట్ ను కేవలం ముంబై ఆటగాళ్లు మాత్రమే శాసిస్తున్నారు. ఒకందుకు ఇది కొంత ఇబ్బందికరం అనిపించినా వాస్తవమే. ఇక బీసీసీఐ ఇప్పుడు మొత్తం భారతీయ జనతా పార్టీ కనుసన్నలలో నడుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు జే షా కార్యదర్శిగా ఉన్నారు. బీసీసీఐకి ప్రెసిడెంట్ బిన్నీ ఉన్నా ఆయన నామ మాత్రమే. జట్టులో ఎవరు ఉండాలి, ఎవరిని తీసేయాలో కూడా జే షా నిర్ణయిస్తున్నాడు.
అందుకే భారత జట్టు ఆశించిన మేర రాణించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే తాజాగా జింబాబ్వే జట్టుతో ఆడే భారత జట్టును టి20 సీరీస్ కోసం ఎంపిక చేసింది బీసీసీఐ. సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఉన్నప్పటికీ ముంబై, గుజరాత్ లాబీయింగ్ ప్రభావం ఎక్కువ.
ఈసారి జరిగిన ఐపీఎల్ లో అద్భుతమైన ఆట తీరుతోనే కాదు నాయకత్వ పరంగా వంద శాతం మార్కులు పొందాడు రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్. తనను పక్కన పెట్టి ఎలాంటి ప్రతిభా పాటవాలు లేని శుభ్ మన్ గిల్ ను తీసుకు వచ్చి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. మొత్తంగా శాంసన్ కెప్టెన్సీకి పనికి రాడా అన్న ప్రచారం జరుగుతోంది.