తెలుగు తమ్ముళ్లకు ఖుష్ కబర్
కష్ట పడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు
అమరావతి – ఏపీ టీడీపీ చీఫ్ , సీఎం నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. ఇప్పటికే 24 మందితో ఆయన కేబినెట్ కొలువు తీరింది. రాష్ట్రంలో ఎవరూ ఊహించని రీతిలో భారీ ఎత్తున మెజారిటీ దక్కింది. మొత్తం 175 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమికి 164 సీట్లు వచ్చాయి. ఇది ఏపీ చరిత్రలో రికార్డ్.
ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు 75 ఏళ్లు వచ్చినా ఆయన ఇంకా నవ యువకుడిగా పని చేస్తున్నారు. పాలనా పరంగా దూకుడు పెంచారు. వస్తూనే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గాడి తప్పిన పాలనను ప్రక్షాళన చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
తొలుత తిరుమల నుంచే ప్రారంభించారు. ఈవో ధర్మా రెడ్డిని పక్కన పెట్టారు. జె. శ్యామలా రావుకు బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కోసం కష్ట పడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు ఇస్తామని ప్రకటించారు.