SPORTS

ప‌సి కూన‌లు కాదు పులి పిల్ల‌లు

Share it with your family & friends

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ కు ఆఫ్గాన్

కింగ్ స్ట‌న్ – ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అండ‌ర్ డాగ్స్ గా అంచ‌నా వేసిన ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్టు ఊహించ‌ని రీతిలో అద్భుత విజ‌యాన్ని సాధించింది. బంగ్లాదేశ్ జ‌ట్టును 8 ప‌రుగుల తేడాతో ఓడించి ఏకంగా సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. దీని వెను భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు అజ‌య్ జ‌డేజా ఉండ‌డం విశేషం.

టోర్నీలో ఆది నుంచీ సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేస్తూ దూసుకు పోతోంది. ప్రత్య‌ర్థి జ‌ట్ల‌కు కోలుకోలేని షాక్ లు ఇస్తూ విస్తు పోయేలా చేస్తోంది. ఆఫ్గ‌నిస్తాన్ గెలుపుతో ఆస్ట్రేలియా ఏకంగా టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

చివ‌రి దాకా బంగ్లా క్రికెట‌ర్ లిట్మ‌న్ దాస్ ప్ర‌య‌త్నం చేసినా , 54 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచినా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ చేసింది ఆఫ్గ‌నిస్తాన్ . 5 వికెట్లు కోల్పోయి 115 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. గుర్బాజ్ ఖాన్ 43 ర‌న్స్ చేశాడు.

అనంత‌రం స్వ‌ల్ప టార్గెట్ ను చేదించ‌లేక చేతులెత్తేసింది బంగ్లాదేశ్. వెంట వెంట‌నే వికెట్ల‌ను కోల్పోవ‌డం, ప‌దే ప‌దే వ‌ర్షం రావ‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. చివ‌ర‌కు 8 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది ఆఫ్గ‌నిస్తాన్.