నాది కూడా బైరెడ్డి రక్తమే
బైరెడ్డి శబరి షాకింగ్ కామెంట్స్
అమరావతి – నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరో కాదు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు. తను మీడియాతో మాట్లాడారు. నంద్యాల లోక్ సభ స్థానం నుంచి తొలిసారిగా ఓ మహిళ ఎంపిక కావడం.
ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకుంది. వైసీపీకి చుక్కలు చూపించింది. నంద్యాల అంటేనే బైరెడ్డి కుటుంబం గుర్తుకు వస్తుంది. ఇక్కడి నుంచే మోస్ట్ పాపులర్ లీడర్ అయ్యాడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. తను ఏపీ స్పోర్ట్స్ చైర్మన్ గా కూడా ఉన్నారు.
ఆయన తన చిన్నాన్న రాజశేఖర్ రెడ్డితో విభేదించాడు. ఇదే సమయంలో ఈసారి ఊహించని రీతిలో రాజశేఖర్ రెడ్డి కూతురు బైరెడ్డి శబరికి ఛాన్స్ లభించింది. ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
భారీ మెజారిటీతో గెలుపొందిన ఆమె ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. తనది కూడా బైరెడ్డి రక్తమేనని , ప్రజలకు సేవ చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు బైరెడ్డి శబరి.