లోక్ సభ స్పీకర్ బరిలో కూటమి
కుదరని ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ – లోక్ సభ స్పీకర్ పదవి ఏకగ్రీవంగా చేయాలని భావించిన భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించ లేదు.
తమకు స్పీకర్ పదవి వదిలి వేయాలని, డిప్యూటీ స్పీకర్ విపక్షాల కూటమికి ఇస్తామని ప్రతిపాదించారు . ఇందుకు ఇండియా కూటమి ఒప్పుకోలేదు. దీంతో ఏకగ్రీవానికి చెక్ పడింది. దీంతో లోక్ సభ సభాపతి ఎన్నిక అనేది అనివార్యంగా మారింది.
ఇటు బీజేపీకి అటు కూటమికి మధ్య కొద్ది సంఖ్య మాత్రమే తేడా ఉంది. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే కూటమి అభ్యర్థి గెలుపొందే ఛాన్స్ ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఏకంగా తమ తరపున కేరళ ఎంపీ సురేష్ ను నామినేషన్ వేస్తారని ప్రకటించింది.
ఇక బీజేపీ సంకీర్ణ సర్కార్ తరపున ఓం బిర్లాను ప్రకటించింది. కూటమి తరపున సురేష్ బరిలో నిలిస్తే పోటీ రసవత్తరం కానుంది.