సమగ్ర సమాచారం అత్యంత కీలకం
స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి – ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శాసన సభ వ్యవహారాలకు సంబంధించి నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సెషన్ ను ఉద్దేశించి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును గమనించాలని, ఎప్పటికప్పుడు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఎవరెవరు ఏయే శాఖలను చూస్తున్నారో, ఆయా శాఖల పనితీరు, కావాల్సిన నిధులు, చేపట్టాల్సిన పనుల గురించి సమగ్ర సమాచారం కలిగి ఉండాలని అన్నారు. దీని వల్ల తాము ప్రజలకు , నియోజకవర్గానికి ఏం చేయగలమనేది స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. లేక పోతే ఇబ్బందులు ఏర్పడుతాయని పేర్కొన్నారు.