NEWSANDHRA PRADESH

టెట్ పాసైన అభ్య‌ర్థుల‌కు కంగ్రాట్స్

Share it with your family & friends

తెలియ చేసిన ఏపీ మంత్రి లోకేష్

అమ‌రావ‌తి – నిరుద్యోగ అభ్య‌ర్థులు గ‌త మూడు నెల‌లుగా ఎదురు చూస్తున్న ఏపీ టెట్ (టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) 2024 కు సంబంధించిన ఫ‌లితాల‌ను మంగ‌ళ‌వారం ఏపీ ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న టెట్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులైన వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

. టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ కి అందరూ సన్నద్ధం కావాలని కోరారు నారా లోకేష్. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికి
అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించ బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండ బోతుందని తెలిపారు .