వెంకయ్యను కలిసిన పీఎం మోడీ
ఇద్దరు నేతల మధ్య చర్చలు
న్యూఢిల్లీ – మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇంటికి మంగళవారం స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెళ్లారు. ఇవాళ కీలకమైన రోజు. దీనికి కారణం ఏమిటంటే లోక్ సభలో అత్యంత కీలకమైన స్పీకర్ పదవి కోసం పోటీ నెలకొనడం. గతంలో ఉప రాష్ట్రపతిగా , కేంద్ర మంత్రిగా ప్రధాన ప్రతిపక్షాల నేతలతో సత్ సంబంధాలు కలిగి ఉన్నారు వెంకయ్య నాయుడు.
ఇదే సమయంలో అనుకోకుండా ప్రధానమంత్రి స్వయంగా తన ఇంటికి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు శాలువా కప్పి ఆహ్వానించారు. ఇద్దరి మధ్య కీలకమైన అంశాలకు సంబంధించి చర్చలు మొదలయ్యాయి.
భారతదేశ ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు నరేంద్ర మోడీకి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. పరస్పర చర్చల్లో ప్రధానంగా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు.
రాబోయే సంవత్సరాల్లో అతని నాయకత్వంలో భారత్ కీర్తి కొత్త శిఖరాలను అధిరోహిస్తుందన్న నమ్మకం తనకు ఉందని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.