నేను అన్నదాంట్లో తప్పేముంది..?
సమర్థించుకున్న ఎంపీ ఓవైసీ
న్యూఢిల్లీ – లోక్ సభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఇందుకు ప్రధాన కారకుడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మంగళవారం ఎంపీలుగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశాడు.
ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తాను జై భీమ్ , జై మీమ్ , జై తెలంగాణ..జై పాలస్తీనా అని చెప్పానని, ఇందులో వ్యతిరేకంగా ఏముందంటూ ప్రశ్నించారు. తాను అన్నది ప్రజలకు, దేశానికి వ్యతిరేకం కాదన్నారు అసదుద్దీన్ ఓవైసీ.
ఇలా అనడం ఎలా వ్యతిరేకం అవుతుందో మీరే చెప్పండి అంటూ మీడియాతో ఎదురు ప్రశ్న వేశారు. ఇలా అనకూడదని భారత రాజ్యాంగంలో ఏమైనా ఉందా అని నిలదీశారు. ఇందుకు సంబంధించి రూల్స్ ఏమైనా ఉన్నాయా అంటే చూపించాలని కోరారు.
ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, గంగాపురం కిషన్ రెడ్డి , తదితర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఓవైసీ చేసిన కామెంట్స్ లోని పదాలను రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా.