కేసీఆర్ కు మరోసారి నోటీసులు
జారీ చేసిన విద్యుత్ కమిషన్ చైర్మన్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. తన పాలనా కాలంలో 24 గంటల సరఫరా పేరుతో నిలువు దోపిడీకి పాల్పడ్డారని, ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించ లేదని పేర్కొంటూ సీరియస్ అయ్యింది విద్యుత్ కమిషన్ .
విద్యుత్ సరఫరాకు సంబంధించి చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు ఆదేశించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి నరసింహా రెడ్డి సారథ్యంలో విద్యుత్ కమిషన్ ను ఏర్పాటు చేశారు.
కమిషన్ బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. దానికి బదులుగా సుదీర్ఘ లేఖ రాశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. ఈ కమిషన్ ను రద్దు చేయాలని, పూర్తిగా అసంబద్దంగా ఉందంటూ ఆరోపించారు. దీనిని సవాల్ చేస్తూ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చింది పవర్ కమిషన్. ఈనెల 27వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది.