రాహుల్ గాంధీ రియల్ లీడర్
స్పీకర్ సహాయకుడికి షేక్ హ్యాండ్
న్యూఢిల్లీ – కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సంచలనంగా మారారు. ఆయన భారత రాజ్యాంగం పుస్తకాన్ని తీసుకుని పార్లమెంట్ సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశౄరు. ఈ సందర్బంగా సభాపతితో పాటు పక్కనే ఉన్న సహాయకుడికి, ఆ వెనుక వున్న మరో అధికారికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. పదవి అన్నది పేరుకే కానీ ప్రజాసేవే అత్యంత ముఖ్యమని మరోసారి చాటి చెప్పారు.
ఈ దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాలంటూ వేల కిలోమీటర్లు దేశ వ్యాప్తంగా తిరిగారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశాన్ని , 143 కోట్ల మంది భారతీయులను కదలించింది. గతంలో తక్కువ సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ పుణ్యమా అని భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకోగలిగింది.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ ప్రదర్శించిన తీరు లోక్ సభలో అందరినీ ఆకట్టుకునేలా చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.