వారాహి అమ్మ వారి దీక్షలో పవన్
దీక్షకు శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల దీక్షను ప్రారంభించారు. ఆయనకు కొండగట్టులో కొలువు తీరిన ఆంజనేయ స్వామతో పాటు వారాహి అమ్మ వారంటే చచ్చేంత ఇష్టం. తనకు మనో , శారీరక బలాన్ని ఇచ్చేది అంజన్న, అమ్మ వారు మాత్రమేనని పదే పదే చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా పేరు పొందారు. నటుడిగా చేసినవి కొన్ని సినిమాలే అయినా అవి బంపర్ హిట్. మినిమం గ్యారెంటీ కలిగిన ఏకైక నటుడు. తను ఊహించని రీతిలో రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలకు మేలు చేయాలన్న సత్ సంకల్పంతో తన స్వంత ఖర్చులతో జనసేన పార్టీని ఏర్పాటు చేశాడు.
తొలుత పరాజయం పాలైనా ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గతంలో కొలువు తీరిన జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై అలుపెరుగని రీతిలో యుద్దం చేశాడు పవన్ కళ్యాణ్. తాను అనుకున్నది సాధించేంత వరకు నిద్ర పోలేదు. చివరకు ఏపీలో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏకంగా భారీ గా సీట్లు కైవసం చేసుకునేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏకంగా పవన్ వ్యక్తి కాదు తుఫాన్ అని కితాబు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఏపీకి డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన పవర్ స్టార్ అమ్మ వారి దీక్షకు శ్రీకారం చుట్టారు.