ఏపీలో క్రీడాభివృద్దికి సహకరిస్తా
క్రికెటర్ హనుమ విహారీ కామెంట్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ తో పాటు ఇతర క్రీడల అభివృద్దికి తన వంతు సాయం అందజేస్తానని అన్నారు క్రికెటర్ హనుమ విహారి. ఆయన మర్యాద పూర్వకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి హనుమ విహారి భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా లోకేష్ తో క్రీడలకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ విషయం గురించి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మంత్రి నారా లోకేష్ తో కలవడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు హనుమ విహారి.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో తన పునః ప్రవేశం గురించి చర్చించడం జరిగిందని, ఇందుకు నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సందర్బంగా నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. క్రికెటర్ హనుమ విహారి తనను కలవడం ఆనందం కలిగించిందన్నారు.
తమ ప్రభుత్వం క్రీడలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుందన్నారు. గత వైసీపీ సర్కార్ హనుమ\ విహారిని అవమానించిందని , కానీ ఆయన సేవలు వాడుకుంటామని స్పష్టం చేశారు నారా లోకేష్.