NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ తో హ‌నుమ విహారీ భేటీ

Share it with your family & friends


ఏపీలో క్రీడ‌ల అభివృద్దిపై చ‌ర్చ
అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క్రికెట్ తో పాటు ఇత‌ర క్రీడ‌ల అభివృద్దికి త‌న వంతు సాయం అంద‌జేస్తాన‌ని అన్నారు క్రికెట‌ర్ హ‌నుమ విహారి. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఏపీ ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తో హ‌నుమ విహారి భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క్రీడ‌లకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ విష‌యం గురించి ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. విహారి చెప్పిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ లో త‌న పునః ప్ర‌వేశం గురించి చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని, ఇందుకు నారా లోకేష్ సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు హ‌నుమ విహారి. ఇదే స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్ ను క‌ల‌వ‌డం సంతోషం మిగిల్చింద‌ని పేర్కొన్నారు.

త‌మ ప్ర‌భుత్వం క్రీడ‌ల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. గ‌త వైసీపీ స‌ర్కార్ హ‌నుమ\ విహారిని అవ‌మానించింద‌ని , కానీ ఆయ‌న సేవ‌లు వాడుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు .