నారా లోకేష్ ప్రజా దర్బార్
సమస్యలతో పోటెత్తారు
అమరావతి – ఏపీ ఐటీ , కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన మంత్రిగా కొలువు తీరిన వెంటనే దర్బార్ కు శ్రీకారం చుట్టారు. తనతో ఎవరైనా నేరుగా కలిచేందుకు ఛాన్స్ ఉంటుందని ప్రకటించారు.
ఎలాంటి భేషజాలు లేకుండా ఎవరైనా తమకు ఇబ్బంది ఉంటే, తమ సమస్యలు పరిష్కారం కాక పోతే తనను వ్యక్తిగతంగా కలిసి చెప్పు కోవచ్చని, వినతి పత్రాలు ఇస్తే సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ స్పష్టం చేశారు నారా లోకేష్.
దీంతో వేలాదిగా ప్రజా దర్బార్ కు జనం క్యూ కట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను గెలిపిస్తే ప్రజల మధ్యనే ఉంటానని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన అమరావతిలో కాకుండా మంగళగిరిలోనే మకాం వేశారు.
ప్రజా దర్బార్ నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నారా లోకేష్. ప్రజలు తనకు భారీ మెజారిటీ కట్ట బెట్టారని, వారి రుణం తీర్చుకునే అవకాశం ఆ వేంకటేశ్వరుడు తమకు ఇచ్చాడని అన్నారు లోకేష్.