NEWSTELANGANA

కాంగ్రెస్ పాల‌న న‌య వంచ‌న‌

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. మోసానికి, న‌య వంచ‌న‌కు కేరాఫ్ ఆ పార్టీ అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఓ వైపు భార‌త రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షిస్తామంటూనే మ‌రో వైపు పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తోందంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ హిపోక్ర‌సీ చూస్తుంటే ఆవేద‌న క‌లుగుతోంద‌న్నారు. దోచు కోవ‌డం, దాచు కోవ‌డం అనేది ప‌నిగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి.

అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డం, పని గ‌ట్టుకుని బీఆర్ఎస్ పై , మాజీ సీఎం కేసీఆర్ పై , త‌న‌పై, హ‌రీశ్ రావు, క‌విత‌పై నోరు పారేసు కోవ‌డం అల‌వాటుగా మారిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎంత మంది ప్ర‌జా ప్ర‌తినిధులను కాంగ్రెస్ లోకి చేర్చుకున్నా త‌మ‌కు ఒరిగేది ఏమీ లేదంటూ పేర్కొన్నారు కేటీఆర్.