NEWSNATIONAL

లోక్ స‌భ స్పీక‌ర్ గా ఓం బిర్లా ఎన్నిక

Share it with your family & friends

అభినందించిన మోడీ..రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌కు తెర లేపిన లోక్ స‌భ స్పీక‌ర్ వ్య‌వ‌హారం ఎట్ట‌కేల‌కు ముగిసింది. బుధ‌వారం ఓం బిర్లా మ‌రోసారి స‌భాప‌తిగా ఎన్నిక‌య్యారు. ఇది 18వ లోక్ స‌భ కావ‌డం గ‌మనార్హం.

నూత‌నంగా స్పీక‌ర్ గా ఎన్నికైన ఓం బిర్లాను దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ త‌న సీటులో కూర్చోబెట్టారు. అనంత‌రం ఈ ఇద్ద‌రు అగ్ర నేత‌లు నూత‌న స్పీక‌ర్ ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌ధానంగా రాహుల్ గాంధీ ఓం బిర్లాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.

మూజు వాణి ఓటుతో లోక్ స‌భ స్పీక‌ర్ ను ఎంపిక చేశారు. మ‌రో వైపు స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఎన్నిక‌య్యారు రాహుల్ గాంధీ. గాంధీ కుటుంబంలో కీల‌క ప‌ద‌విని చేప‌ట్టిన మూడో స‌భ్యుడు కావ‌డం విశేషం.

1999 నుండి 2004 వరకు పని చేసిన తన తల్లి సోనియా గాంధీ, 1989 నుండి 1990 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తన తండ్రి రాజీవ్ గాంధీ అడుగు జాడల్లో రాహుల్ గాంధీ నడుచుకున్నారు.