లోక్ సభను నడపడంలో స్పీకర్ సక్సెస్
ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం అత్యంత ప్రతిష్టాత్మకమైన లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరిగింది. మూజు వాణి ఓటుతో స్పీకర్ గా ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. అనంతరం ఓం బిర్లాను మోడీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సీటులో కూర్చోబెట్టారు.
ఇదిలా ఉండగా రెండోసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు ఓం బిర్లా. ఆయన చరిత్ర సృష్టించారు. నూతన స్పీకర్ గా కొలువు తీరిన ఓం బిర్లాను నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ అభినందించారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడారు.
17వ లోక్ సభను విజయవంతంగా నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించారంటూ ఓం బిర్లాకు కితాబు ఇచ్చారు. గత ఐదేళ్లలో ఎన్నో చరిత్రాత్మకమైన బిల్లులు మీ ఆధ్వర్యంలోనే ఆమోదం పొందాయని తెలిపారు మోడీ.
మరో ఐదేళ్ల పాటు లోక్ సభ ను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రధానమంత్రి.