లోక్ సభలో ప్రతిపక్ష నేత కీలకం
ప్రధాన ఆకర్షణగా మారిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – 18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికలో మూజు వాణితో ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా రాయ్ బరేలి నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలతో కూడిన కూటమి ఏకగ్రీవంగా ఆయన ఎన్నికను ఆమోదించింది.
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ కీలకమైన , ముఖ్యమైన భూమిక పోషించ బోతున్నారు. భారత దేశ పరంగా లోక్ సభ చరిత్ర ను పరిశీలిస్తే 1969లో రామ్ సుహాగ్ సింగ్ తొలిసారిగా ఆ పదవిని చేపట్టారు.
అప్పటి నుండి, ఈ పాత్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా మారింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (CVC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల వంటి కీలక అధికారుల నియామకంలో ప్రతిపక్ష నాయకుడు కీలక పాత్ర పోషిస్తారు.