NEWSNATIONAL

స్పీక‌ర్ నిష్ప‌క్ష‌పాతంగా ఉండాలి

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ – లోక్ స‌భలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 18వ లోక్ స‌భ నూత‌న స్పీక‌ర్ గా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఓం బిర్లా మ‌రోసారి ఎన్నిక‌య్యారు. ఆయ‌న మూజు వాణి ఓటుతో ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్బంగా రాహుల్ గాంధీ అభినందించారు ఓం బిర్లాను. స్పీక‌ర్ కు ఎలాంటి ప‌క్ష‌పాత ధోర‌ణి ఉండ కూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌తంలో మీరు అనేక‌మైన త‌ప్పిదాలు చేశారంటూ పేర్కొన్నారు. ప్ర‌ధాని ఆయ‌న ప‌రివారం ఎలా చెబితే అలా ఆడుకుంటూ వ‌చ్చార‌ని, ఇష్టానుసారం బిల్లులు ఆమోదం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

భారత రాజ్యాంగంలో స్పీక‌ర్ కు అత్యున్న‌త‌మైన స్థానం ఉంద‌ని, దాని గురించి మ‌రిచి పోవ‌ద్ద‌ని సూచించారు రాహుల్ గాంధీ. మీరు స‌భ‌ను ఎంత వ‌ర‌కు నిర్వ‌హిస్తార‌నేది ముఖ్యం కాద‌న్నారు. లోక్ స‌భ‌లో ప్ర‌జ‌ల వాణికి ప్రాతినిధ్యం వ‌హించేందుకు ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన కూట‌మిని ఎంత వ‌ర‌కు అనుమ‌తి ఇస్తారో చెప్పాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌న్నారు రాహుల్ గాంధీ.