వరుస సమీక్షలతో పవన్ బిజీ
స్వచ్చాంద్ర కార్పొరేషన్ పై ఆరా
అమరావతి – ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా మారారు. ఆయన కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తనకు కేటాయించిన శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. ప్రధానంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జూలై 1 నుంచి పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా బుధవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ బాధ్యులు హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశాన్ని మంగళగిరిలోని తన నివాసంలో ఏర్పాటు చేశారు.
ప్రజా పాలనే ఎజెండాగా తాము పని చేస్తామని తెలిపారు. ఎవరూ కూడా బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదని సుతిమెత్తంగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్.