NEWSNATIONAL

ఓవైసీపై అన‌ర్హ‌త వేటు వేయాలి

Share it with your family & friends

ఎంఐఎం చీఫ్ పై కేసు న‌మోదు

న్యూఢిల్లీ – ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీకి బిగ్ షాక్ త‌గిలింది. జ్ఞాన‌వాపి కేసులో పోరాటం చేస్తున్న ప్ర‌ముఖ న్యాయ‌వాది విష్ణు శంక‌ర్ జైన్ ఓవైసీపై భ‌గ్గుమ‌న్నారు. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

లోక్ స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న సంద‌ర్బంగా ఓవైసీ జై తెలంగాణ జై పాల‌స్తీనా అని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు. ఓవైసీ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి.

భార‌త దేశంలో ఉంటూ ఇక్క‌డి సౌక‌ర్యాలు అనుభ‌విస్తూ ఇత‌ర దేశాల గురించి ఎలా ప్ర‌స్తావిస్తారంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇదిలా ఉండ‌గా న్యాయ‌వాది కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓవైసీ వ్యాఖ్య‌లు దేశానికి వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని, లోక్ స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ కేసు వేశారు.