ENTERTAINMENT

జ‌క్క‌న్న‌..షబానాకు ఆస్కార్ పిలుపు

Share it with your family & friends

కొత్త స‌భ్యులు 487 మందికి ఆహ్వానం

అమెరికా – ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆస్కార్ నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ సంవత్సరం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో చేరేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా 487 మందిని ఎంపిక చేశారు. ఇందులో భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ న‌టి ష‌బానా ఆజ్మీతో పాటు ఆస్కార్ విన్న‌ర్ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళికి , ఆయ‌న భార్య‌కు కూడా ఆహ్వానం అందింది.

థియేట్రికల్ చలన చిత్రాలకు చేసిన కృషికి గాను ప్రసిద్ధి చెందిన కళాకారులు ,కార్యనిర్వాహకులు జాబితాలో ఉన్నారని అకాడమీ వెల్లడించింది. భారతీయ ప్రతిభావంతుల జాబితాలో షబానా అజ్మీ ఉన్నారు, ఆమె శ్యామ్ బెనెగల్ తీసిన‌ అంకుర్‌లో తన స్టార్ అరంగేట్రం చేశారు.

అర్థ్, గాడ్ మదర్ , రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో నటనను అకాడమీ గుర్తించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్ ద‌ర్శ‌కుడు రాజమౌళికి ద‌క్కింది. ఇదే స‌మ‌యంలో సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్స్ చూసిన రాజ‌మౌళి భార్య ర‌మా రాజ‌మౌళిని కూడా ఆహ్వానించింది.

టోరాస్ హస్బెండ్ , విలేజ్ రాక్‌స్టార్స్ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలకు ప్రసిద్ధి చెందిన రిమా దాస్ కూడా ఆహ్వానించ బడిన దర్శకులలో ఉన్నారు. దిల్ చాహ్తా హై , గల్లీ బాయ్ చిత్రాల కోసం నిర్మాత రితేష్ సిధ్వానీ నిర్మాతల శాఖలో చేరారు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ని ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ బ్రాంచ్‌కి ఆహ్వానించారు.