కోట్లు మాయం డిప్యూటీ సీఎం ఆగ్రహం
విస్మయం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
మంగళగిరి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్మయానికి గురయ్యారు. ఆయన తనకు కేటాయించిన శాఖలపై సమీక్ష ప్రారంభించారు. ఈ సందర్బంగా తన నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు సదరు సంస్థలో కేవలం రూ. 7 కోట్లు మాత్రమే మిగిలి ఉండడాన్ని తప్పు పట్టారు. ఈ డబ్బులు కేవలం 5 నెలల జీతాలకు మాత్రమే సరి పోతాయని పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు.
2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయింది.
దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్ళాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంధ్ర ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించింది. రూ.46 కోట్లు ఖర్చు చేసింది.