ఏపీ సర్వీస్ లోకి మహేష్ చంద్ర లడ్డా
పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ
అమరావతి – ఏపీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తన పాలనా మార్క్ ను చూపిస్తున్నారు. కీలకమైన శాఖలలో బదిలీలకు తెర తీశారు.
తాజాగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డిపై వేటు వేశారు. సీనియర్ సిన్సియర్ ఆఫీసర్ గా పేరు పొందిన జె. శ్యామలా రావుకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. జేఈవోగా వీర బ్రహ్మంను కొనసాగిస్తున్నారు.
ఇదే సమయంలో డీజీపీని కూడా మార్చేశారు. సీఎస్ జవహర్ రెడ్డిని పంపించారు. ఆయన స్థానంలో సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను తీసుకు వచ్చారు. మరో వైపు సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా కేంద్ర సర్వీస్ లో విధులు నిర్వహిస్తున్న మహేష్ చంద్ర లడ్డాను ఏపీకి పంపించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఆయనను సీఆర్పీఎస్ ఐజీగా నియమించనున్నట్లు సమాచారం. నాయుడు లేఖతో కేంద్రం స్పందించింది. ఆయనను ఏపీకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.