ENTERTAINMENT

క‌ల్కి మూవీ సూప‌ర్

Share it with your family & friends

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్

హైద‌రాబాద్ – నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌ల్కి 2989 ఏడీ గురువారం అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ , దీపికా ప‌దుకొనే , అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ , త‌దిత‌రులు క‌లిసి న‌టించిన ఈ చిత్రం ఓపెనింగ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.

హాలీవుడ్ ను త‌ల‌ద‌న్నేలా మ‌న‌సు పెట్టి తీశాడు నాగ్ అశ్విన్. రూ. 600 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో క‌ల్కి చిత్ర‌న్ని .లేటెస్ట్ టెక్నాల‌జీ , వీఎఫ్ఎక్స్ , ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌మాణాల‌తో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చిత్రాన్ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు.

81 ఏళ్ల వ‌య‌సులో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఇక స‌హ‌జ సిద్ద న‌టుడిగా గుర్తింపు పొందిన క‌మ‌ల్ హాస‌న్ చిత్రానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా మారాడు. భైర‌వగా ప్ర‌భాస్ ప‌ర్వాలేద‌ని అనిపించాడు. మొత్తంగా క‌ల్కి ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది