జగన్ కు అంత సీన్ లేదు
సమస్యలకైతే అసెంబ్లీకి రావచ్చు
అమరావతి – ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారని అయినా తన తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు.
ఏం అర్భత ఉందని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ప్రశ్నించారు జగన్ రెడ్డిని. ఉన్న సీట్లతో ఆయన మరోసారి రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. లేని అధికారం కోసం ఆరాట పడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. తనకు ప్రతిపక్ష హోదా కావాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తను పవర్ లో ఉన్న ప్పుడు తమ వారిని ఎలా వేధింపులకు గురి చేశాడో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
ఆనాడు 10 శాతం సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా అని సభలోనే చెప్పిన జగన్ నేడు ఎలా మరిచి పోయారంటూ నిలదీశారు పయ్యావుల కేశవ్. జగన్ తన స్వీయ రక్షణ కోసం ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని మండిపడ్డారు.. ప్రజల కోసమైతే, అసెంబ్లీకి రావొచ్చు, దర్జాగా ప్రజా వాణిని వినిపించ వచ్చని అన్నారు .